Sunday 9 February 2014

సి పి బ్రౌన్

అతడు మహా నిశీధి తమసాళికి జిక్కి లయించు నాంధ్ర సా
హితికి వెలుంగొసంగు రవియే ; యుసురూడెడి వేళ తార్క్ష్యు డై
బ్రతుకునొసంగెయమృతముప్రాశననిచ్చి తెలుంగు శారద
న్నతులిత వైభవంబలరనందలమందగ జేసె ధీరుడై

లండను వాడైన  సరే 

భారతావని అన్నపూర్ణ

బొమ్మలబెండ్లి జేయుచును బోలెడు ద్రవ్యము ఖర్చు జేసి పెం
గమ్మని వంటకంబులను గ్రక్కున విస్తరలుంచి ఎల్లరుం 
గ్రమ్మఱ నారగించి కడు గఱ్ఱున ద్రేచగా బెట్టు నన్నపూ 
ర్ణమ్మల గన్న భారతికి హస్తములెత్తి నమస్కరించెదన్

ప్రార్ధన

మూషిక వాహనున్ గిరిజ ముద్దుల పట్టికి జ్ఞానదాయకున్ 
భాషిత దివ్యవాక్యుని సుపాలిత భక్త నికాయునిన్ సదా 
భూషిత మౌక్త్యహారునినభోమణి కోటిగదేజరిల్లు నా 
భీషణ పాపహారుని గభీర శరీరుని భక్తిగొల్చెదన్